Tuesday, May 22, 2018

పిచ్చి మనసా

పిచ్చి మనసా

మారుతున్న మనుషులెంత 
సహజమో 
మారే మనసులు అంతే సహజము 

పగలు తరువాత రేయి ఎంత 
సహజమో 
నమ్మిన తరువాత వంచన అంతే సహజం

పదే పదే తిన్న పదార్ధం వెగటు కలిగించటం 
ఎంత సహజమో 
చేరువైనాక దూరమవ్వటం అంతే సహజం

నిన్న తరువాత నేడు 
నేడు తరువాత రేపు 
ఎంత సహజమో 
ఆరాధన తరువాత నిరసన 
ప్రేమ తరువాత క్రోధం 
అంతే సహజం 
ఎక్కడో 
ఎప్పుడో 
అసహజంగా 
కొందరు మనసున్న మనుషులు 
ఎప్పటికి మారకుండా 
చేరువైనాక దూరం కాకుండా 
ఒకే రకమైన
ఆరాధన ఆత్మీయతతో ఉంటారు 
అలాంటి వాళ్ళు ఎదురైతే 
ఎదలో పదిలంగా దాచుకో 
ప్రాణంలా కాపాడుకో 
అలా మనుషులు లేరని
మనసులు లేవని 
పదే పదే 
మనసుని
మానలేని గాయాలు చేసుకోకు.......

No comments: