Sunday, August 3, 2014


జగమంత ఒక్కటై నను వెలివేయుచున్నా . ,
నా వెంట నడిచేటి నమ్మకం వాడు . . !
కన్నీరు ఉప్పెనై నను ముంచుతున్నా . . ,
నా కొరకు మిగిలిటి ఓదార్పు వాడు . . . !
కష్టాలు కాటేయ నను చేరుతున్నా . . . ,
ఎదురించ నిలిచేటి ధైర్యమే వాడు . . . . !



ఏ విజయ తీరాన నే చేరి ఉన్నా . . . ,
సంతోష సంద్రాన మునిగేది వాడు . . . . !
నిస్వార్థ మైత్రికి మరురూపమే కాదు  . . . ,
నా మేలు కోరేటి మిత్రుడే వాడు . . . ...!

No comments: