Sunday, November 25, 2012

మనసుకి స్నేహం మత్తు

మనసుకి స్నేహం మత్తు
నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు
మౌనం భాషనేర్పినవ్వుకుంటూ
ఇంకా ఎంతకాలమిలా..?
ఆగని కాలంకేసి భారంగా
చూస్తూభారమైపోతున్న
గుండెకేసి జాలిగా
చూస్తూచూస్తూ..చూస్తూ..
చెలిని దూరం చేసుకుంటూ
ఇంకా ఎంత కాలమిలా..?
తొలి పొద్దులో గరిక పూవుపైమంచు
తాకి మైమరచింది నేనేనా?
ముంగిట ముగ్గుకి రంగులద్ది
మురిసిపోయిన మనిషి నేనేనా?
వాన చినుకుల్లో కలిసి తడిసి
అలిసిపోయిన మనసు నాదేనా?
రేకులు రాలుతున్న పూవును
చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?
ఏది అప్పటి సున్నితత్వం?
ఏది అప్పటి భావుకత్వం?
ప్రతి రాత్రి నను పలుకరిస్తూ
మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు!
వెన్నెల ఊసులెన్నో చెపుతూ గుండెల్లో
ఊహలెన్నొ నింపుతాడు !
ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు
ఈరోజు నిశీధినేలే నెలరాజు!
లోకమంతా చీకటి...
మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి.....
ఇట్లు .....
మీ   లక్ష్మి  శ్రీనివాస్  

No comments: