బంధుత్వాలు కలుపుకోటానికి
కులము మతము సంప్రదాయం చూడవచ్చు
బంధాన్ని పెంచుకోటానికి
మనసు మానవత్వం సంస్కారం ఉంటే చాలు
బంధుత్వాలకి పరిధి ఉంటుంది
బంధాలకి పరిమితి మన మానసిక పరిపక్వతే
కొంతమందితో ఏ బంధుత్వం ఉండదు
కానీ వారు లేనిదే జీవితం ఉండదు అనిపించేలా
బంధం ఏర్పడుతుంది
ఈజన్మలో బంధుత్వాలకి ఒక ఆధారం కనిపిస్తే
గత జన్మలలో బంధుత్వాలన్నీ నిరాధారంగా
మన జీవితాలను అల్లుకొని పెనవేస్తాయి
అవ్యక్తమైన ప్రేమ, అభిమానం ఆత్మీయతలు
పంచే పెంచే బంధాలు దైవమిచ్చిన వరం
No comments:
Post a Comment