Sunday, December 18, 2016

ఎన్ని మార్పులో 
కనిపించే మనిషిలో
కనిపించని మనసులో 

ఒక నాడు 
అత్యంత విలువైన  
స్నేహం 
బంధం 
అనుబంధం 
నేడు వెల లేక
వెల వెల పోతున్నది 

ఒక నాడు 
వెల్లువై పెల్లుబికిన 
ఆత్మీయత
అనురాగం 
నేడు ఇంకిపోయి 
బీడువారి పోయినది 

ఒక నాడు
క్షణ క్షణం 
ఊపిరిగా 
ప్రాణంగా  
పంచుకొన్న ప్రేమ 
నేడు కాలగర్భంలో 
కలిసి మాయమయింది 

నిజమే 
అమలిన ప్రేమ 
ఆశించని బంధాలు 
స్వార్ధమెరుగని అనుబంధాలు 
ఎవరికి కావాలి ?? 
అవి లేవని ఆక్రోశిస్తాము 
అవేదన పడతాము 
కానీ 
వాటిని కాపాడము 
నిందలతో దూరం చేసుకొంటాము 

ప్రేమ అనే పదము 
అమృతమే 
దానిలో 
అసూయ 
ద్వేషం 
ఈర్ష 
స్వార్ధం 
అనే విషపు చుక్కలు
కలపనంతకాలమూ 

కాల గతిలో 
కన్నీటి చుక్కలతో 
రాసుకున్న 
నా ఆత్మీయ గీతం 
శిలా శాసనమై 
హృదయ ఫలకంలో 
ఎన్నటికీ పదిలమే 

No comments: