కొన్ని క్షణాలు ఇలానే ఆగిపోతే
ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది...
కొన్ని బంధాలు ఎప్పటికీ
చెరగని అనుబంధాలు గా మమేకమై
మనతోనే ఉంటే ఎంతో బాగుండు అనిపిస్తుంది
కొన్ని జ్ఞాపకాలు గుండెల్లో పదిలంగా
తమవైన పాదముద్రలు వేసుకుంటాయి..
నా జీవితం...
నా శ్వాస...
నా ప్రాణం.....
అన్నీ నువ్వే,
నీతోనే నా జీవితం ముడిపడి ఉన్నదన్నట్లు....
కానీ నిజానికి మిగిలినవి
నా మనసులో నీ జ్ఞాపకాలు మాత్రమే..
వాటితోనే బ్రతికేలా చేసిన నీ మనస్సు
ఎంత కఠినమైనది కదా...
No comments:
Post a Comment