Monday, November 17, 2014

నీ ప్రేమ పొందే నీ పాపనై నిన్ను చేరుకుంటా ..

చూస్తూనే ఉన్నా 
నువ్వు చేస్తున్న రోజుకో గాయాన్ని గుండెల్లో 
తెలియక చేసే గాయాలు కావు 
నువ్వు తెలిసి చేస్తున్న గాయాలే అని తెలుసు 

ప్రతి గాయం గుండెని తొలిచి వేస్తుంది 
అల్లుకున్న ప్రేమ మందిరాన్ని కొద్ది కొద్దిగా తొలిచి వేస్తున్నా
అని అనుకుంటున్నావు
అనుక్షణం నాపై నాకున్న నమ్మకాన్ని తొలిచి వేస్తున్నావు

ఈ గాయాలు నీ పై నాకున్న ప్రేమని మార్చలేవు
నన్ను ఈ లోకం నుండి మాత్రమె దూరం చేయగలదు
నా మనస్సు నుండి నిన్ను కాదు
అంత లేదు లే మారిపోతావు అనుకుంటే పొరపాటే

మారితే ఈ జన్మ విడిచి మరో జన్మకే
ఆ జన్మ కూడా నీకొరకే నిన్ను చేరే నీ పాపనై
నీ ఒడిలో నిద్దుర పోవటానికే

మల్లి ప్రేమ గాయం భరించలేను
అందుకే నీ ప్రేమ పొందే నీ పాపనై నిన్ను చేరుకుంటా ..

No comments: