Sunday, August 3, 2014

నాకు నేనే, నన్ను నేనే దూరం చేసుకుంటున్నా ....


మొదటిసారి నా కళ్ళ ఎదుట నువ్వు నిలిచిన క్షణం నాకు తిరిగికావాలి
మొదటిసారి నీతో  మాట్లాడిన క్షణం నాకు తిరిగికావాలి
మొదటిసారి నీతో నడిచిన పయనం నాకు తిరిగికావాలి 
 నిన్ను తలవకుండా వొక్క నిమిషం ఐనా గడపాలని అనుకుంటా 
కానీ నువ్వు వదిలి వెళ్ళిన మనసు నాకన్నా నిన్నే ఎక్కువ తలుస్తుంది 
నీ పేరునైనా మరిచిపోదామని పెదవిని మౌనంతో భాదిస్తే 



నువ్వు వెలివేసిన హృదయం నీ పేరునే గుండె చప్పుడుగా మార్చేసుకుంది 
నీ రూపాన్ని ఐనా మర్చిపోదామని కనురెప్పలు ముసిపెడితే 
నా కనుపాప కమ్మని స్వప్నం లోను నిన్నే దాచుకుంది 
ఇక నిన్ను తలవకుండా నిమిషం ఐనా ఉండలేనని తెలిసి 
నాకు నేనే,  నన్ను నేనే దూరం చేసుకుంటున్నా .... 

No comments: