Monday, June 16, 2014

ఊపిరి ఎన్నాల్లు ఉంటుందో మరి


తెగని ఆలోచనల దారానికి
ఎగిరిపడుతున్న నీ ఎదసవ్వడి
మధురమైన నీ ఆలోచనలు
గడియారం ముల్లుల
మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో 
నా శబ్దం ఆలకిస్తూ
ఆ స్తబ్దతను 
ఆస్వాదిస్తుంటే



మరోమారు 
జన్మిస్తున్నట్టుంది…
మరో సారి మరనించినట్టు 
ఉంటుంది
ఈ జనన మరణాల మధ్యి
ఊపిరి ఎన్నాల్లు ఉంటుందో మరి

No comments: