నువ్వెవరో నాకు తెలియకముందు అసలు ఏ గొడవా లేదు
నువ్వు పరిచయమ అయినప్పటినుండి కంటికి కునుకులేదు
రోజుకి ఒక్కసారైనా నీ మాట వినకపోతే కుదురుండదు
క్షణక్షణం నీ ధ్యాసే కానీ నాకు ఏ ఆలోచన లేదు
మండుటెండలో వానచినుకులా నీ స్నేహంతో నన్ను తడిపావెందుకు....
తడిపి తడిపి ఒక్కసారిగా నీ ప్రేమలో నన్ను ముంచేసావెందుకు....
అందమైన ఆనందలోకం నాకు చూపించావు ఇంతవరకూ...
ఇక మీదట నీవు మిగిల్చిన ఈ నరకం నాకు ఎంతవరకూ...
నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకూ తెలిసినా నీ మనసు కరగలేదు......
ఈ మనోవేదన అనుభవించే కంటే ఈ గుండె ఆగిపోయినా ఫర్వాలేదు....
No comments:
Post a Comment