నిన్నటి రోజున జనించిన ఆ మధురమైన
ఆ రాగం మూగబోయినా ఎందుకో
నా గుండె గదిలో
ధ్వనిస్తూనే ఉంటుంది
ఆ పుటలు గాలివాటంలో
కొట్టుక పోయిన
మనసు పొరలలో
నీ జ్ఞాపకాలు తచ్చాడుతూ
రెపరెపలాడుతూనే
వుంటాయి ఎప్పుడూ
మరో రోజూ అలసటతో
విశ్రమించే వరకు….
విరామం లేకుండా నన్నొదలవులే
No comments:
Post a Comment