నువ్వు రావని తెలిసినా.....
నీ కోసం ఎదురు చూస్తుంటాను.
నువ్వు నా ఎదుట లేకున్నా .....
నిన్ను చూస్తూనే ఉంటాను.
నీకు నేను గుర్తు రాకపోయినా.....
నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను.
నా హృదయాన్ని గాయపరచినా.....
నిన్ను నా మనసులోనే కొలువుంచుతాను.
నువ్వు నన్ను వీడిపొయినా.....
నీ కోసమే వేచివుంటాను.
నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ఆరాదిస్తాను
మరుజన్మ కైనా కరునిస్తావని.....
నాకోసమే జన్మిస్తావని
No comments:
Post a Comment