కళ్లు మూస్తే చాలు కరగని కలల కవ్వింతలే.....
శ్వాసిస్తే చా లు ఎద మూలలో నీ దాగుడుమూతలే.....
నాలో ఉన్న నీకు రుజువేల నా సర్వస్వం నీవెగా.....
ఆదరించవే సుకుమారి సాయం కోరి వచ్చా....
ఆవేదన నింపకమ్మ వెండి పోత బొమ్మ...
చుక్కలు తెంపి కంఠ హారం చేయిస్తా ....
కారు మబ్బులతో జాతర చేయిస్తా.....
గ్రహాలు తెచ్చి బంతి చేయిస్తా ....
పూల పల్లకిలో ఊరేగే మగువ,మది కోవెల
తలుపు తెరచి ఉంచ దిగిరా దేవత.....!!
సప్త నదులకు శ్రీకారం చుట్టిన త్రివేణి
నా ప్రేమ దాహం తీర్చవే.....
No comments:
Post a Comment