Tuesday, August 7, 2012

నా కలలు నా ప్రపంచములో జీవిస్తున్నాను నా జీవితమే నీవని !!


నా కనులకు అందని ఓ నా హృదయ సంగీతమా
నా కళ్ళలో కలవై నిలిచిన నీతోనె నా ప్రేమ గీతం!!

తెలియని దారుల్లో నన్ను బందీని చేసిన ఓ నా ప్రాణమా
ఉరికే నా ఊహల్లో ఊపిరివై నిలిచిన నీతోనే నా ప్రయాణం!!
నా ప్రేమకు సంకెళ్ళు వేసిన ఓ నా ఆత్మ బంధమా
నా ఆలోచనల్లో కవితై నిలిచిన నీతోనే నా జీవితం!!
కదిలే కాలంలో...ఒకటిగా లేని మనమిద్దరము
నను వీడి నిను తలచే నా మనసు ఒకటేలే!!






అందుకే ప్రియతమా నను కాదన్న నువ్వే నా ఇష్టం

నా ప్రేమను వద్దన్న.......నీ వైపే నా గమ్యం!!
మాట రాని నా మౌనంలో ఇంక ఎన్నో ఎన్నెన్నో
అందుకే నాలో ఉన్న నీతో ఈ మౌన రాగం ప్రియా!!
మరచిపోలేని నిన్ను మరల మరల గుర్తు చేసుకుంటు
నా కలలు నా ప్రపంచములో జీవిస్తున్నాను నా జీవితమే నీవని !!
నీ కోసమై....

No comments: