LOVE IS ALWAYS PRECIOUS
ఉదయము సాయంత్రము రక్తవర్ణమైన
సూర్యున్ని చూస్తూ విప్లవభావాలతో
పెరిగాను అందుకే కాబోలు
నీ ప్రేమ కూడా నాకు ఒక విప్లవంలా కనిపిస్తోంది
రగిలే గుండెలో నీవు కలిగించిన కరునామయతత్వం
పెట్టుబడి దారి విధానం మీద మేము చేసిన దాడిని గుర్తు చేస్తోంది
కరడుకట్టిన నా గుండెలో నీ చూపులు కలిగించిన
సంచలనం దొరతనాన్ని ఎదిరించడానికి మా విప్లవ వీరులు
ప్రజలలో కగించిన ఉత్తేజాన్ని గుర్తు చేస్తోంది
అవును నేను విప్లవకారున్ని
నాటుబాంబుల వేటకొడవళ్ళ హింసావాదాన్ని
నిత్యం కళ్ళముందు చూస్తూ, ఆ కృత్యాలను చేస్తూ పెరిగాను
నిజంగా నీ రాక నా నిర్జీవపు జీవితంలో ఒక వసంతం
నాలోని ఈ ప్రకంపనం ప్రలోభంలోనికో లేదా
ఉన్మాదం లోనికో జారుకోక ముందే నన్ను నీ
ఒడి చేర్చుకొని ఓదార్చు . నాలో రగిలే ఈ తెలియని జ్వాలలను
నీ స్పర్శతో ఓదార్చు చెలి.
No comments:
Post a Comment