Thursday, August 2, 2012

ఈ లోకాన్ని వదిలేసా...




గుండెల్లో దాగున్న చేదు నిజాలకు

బదులు వెతకలేక క్షణ కాలం మనసులో

నిదురించ కళ్లల్లో కదిలే జ్ఞాపకాల కలలన్నీ

మరువలేక కన్నీటి రోధనను విలపించి ......



వేడుక చూపి వంచించిన మనిషిని....
మార్చలేక విధి రాతకి తల వంచి....

మరో వాడితో కాలం గడపలేక
మదిలో....

మిగిలిన చివరి రూపం చెరపలేక సాగుతున్న.....
కడసారి ఈ కవితని నీకూ అంకితం చేస్తున్నా.....
నీ చోటు ఎవరికి ఇవ్వలేక ఈ లోకాన్ని వదిలేసా...!!

No comments: