మనసులో విరిసిన నీ వేణు గానానికి
గాలిలో లీనమైన నా శ్వాస,.......
"నువ్వు ఎప్పుడొస్తావని" అడుగుతుందే,,,,,??
గాలిలో లీనమైన నా శ్వాస,.......
"నువ్వు ఎప్పుడొస్తావని" అడుగుతుందే,,,,,??
కంట తడితో ఒంటరిగా ఉన్న నన్ను
చూసి హేళన చేసిన కుసుమం....
"నువ్వు ఎప్పుడొస్తావని" అడుగుతుందే.....??
ఏం మాట్లాడలేని అద్దం మౌనంగా
ఉన్న నా మాటలను గుర్తించి...
"నువ్వు ఎప్పుడొస్తావని" అడుగుతుందే......??
మెరిసిపోయే మేఘం నా ఎదలో
జరిగిన దోషం తెలుసుకొని......
"నువ్వు ఎప్పుడొస్తావని" అడుగుతుందే.....??
పచ్చని ఆకులూ వాడిపోయిన పాట
నా జీవితమైనదని విని......
"నువ్వు ఎప్పుడొస్తావని" అడుగుతుందే.....??
తిరిగి రాలేని దూరాన ఉన్న ఊరిలో.....
నువ్వున్నావని ఎలా చెప్పాలి నా ఆవేదనకీ....!!!
No comments:
Post a Comment