నా నేస్తం,.....
నిన్నలేని జీవన పయణంలో కలుసుకున్న ఓ స్నేహా తీరం
నిన్నలేని జీవన పయణంలో కలుసుకున్న ఓ స్నేహా తీరం
నా బాల్య నేస్తం.....!!
జాజి కొమ్మలా ముద్దు మాటలతో
మనసుని మురిపించే మల్లె పూల మాల
నా ప్రాణ నేస్తం.....!!
అమ్మలా అనురాగం పంచుతూ
నాన్నలా ఆప్యాయత చల్లుతూ
అన్నలా ఆనందం అందిస్తూ
ఈ ముగ్గురి రూపాలకి అపురూపమైన
రూపంలా దేవుడు నాకోసం,....
పంపించిన కానుక నువ్వు....!!
మన అల్లరి ఆటలు సౌఖ్యంగా
మన కుప్పి గంతులు కుశలంగా
మన చిలిపి చేష్టలు హాయిగా
చిన్ననాటి జ్ఞాపకాలు స్నేహమై నను అల్లుకోగా,
మరుజన్మదాకా కాదు,ఎన్ని జన్మలుంటే అన్ని
జన్మలకు నువ్వే నా నేస్తం.....!!!
No comments:
Post a Comment