Monday, November 28, 2022

ప్రాణం తో ఉన్నంతవరకు...

 జీవితం అనుకున్న వాళ్ళని మర్చిపోవటం

అంటే ...

మనం చచ్చిపోవటం..



ప్రాణం ఉన్నంత వరకు....

మరిచిపోవటం అవుతుందా అసలు!!!!

Sunday, November 27, 2022

ప్రపంచాన్ని మరిచి

 ప్రపంచాన్ని మరిచి నీతో ఇలా...
ఏకాంతంగా గడిపేయాలని ఉంది...
నీ మాటలు, నీ నవ్వు తప్ప
నాకు ఇంకా ఏమి వినిపించకూడదు....


మన జీవితంలో ఆ మధుర   క్షణాలు వస్తాయి
అని ఎదురు చూస్తూ....!!!!
ప్రతిక్షణం నీ గురించి మాత్రమే ఆలోచించే 
     నీ.... 

Wednesday, July 20, 2022

కలగా మిగిలింది నీ పరిచయం.. కథగా సాగింది నా జీవితం..



కలగా మిగిలింది నీ పరిచయం..

కథగా సాగింది నా జీవితం..

కన్నీరే ఇచ్చింది నీ జ్ఞాపకం..

కనుమరుగైపోయింది కళ్ళల్లో నీ రూపం..

మనసులు కలిసాయి.



మాటలు కలిసాయి..

నీ మనసు లోతుల్లో ఉన్న ప్రేమనే సమాధి చేశాయి.

బాధని పెంచాయి..

నన్ను భంధించేసాయి.

మరచిపోలేని గురుతులు ఎన్నో గుచ్చేస్తున్నాయి..


కలగా మిగిలింది నీ పరిచయం..

కథగా సాగింది నా జీవితం..

Saturday, September 4, 2021

#ఒక #ఆడపిల్ల

 #ఒక #ఆడపిల్ల 


ప్రాణంగా ప్రేమించిన వాడిని కూడా కాదనుకొని..!!

ప్రాణం బిగపట్టుకొని ప్రాణం పోసిన...


తల్లిదండ్రుల పరువు కోసం మనసు చంపుకొని..!!

పరాయి వాడిని పెళ్లి చేసుకుంటే...


పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళికిముందే నువ్వు ఎవడినో ప్రేమించావని ఆప్రేమ ఈ పెళ్లితో ఆగిపోతుందా...



అంటూ ఆరాలు తీస్తూ అర్థం లేని మాటలతో...!!

అడుగడునా అవమానిస్తూ తన ప్రతి కదలికను.


అనుమానిస్తూ ,తన కలల్ని కోరికలని కాలరాస్తూ.!

నాలుగు గోడల మధ్యన బంధిని చేసి...


చిత్రహింసలు  పెట్టి వేదిస్తుంటే.....!!

ఆ ఆడపిల్ల నేను ఏ తప్పు చేయలేదని...


వేడుకుంటున్నా అర్థం చేసుకోలేని వెర్రివాడితో..!!

అర్థం లేని జీవితాన్ని అర్దాంతరంగా....


ముగించేలా...తాను కోరుకున్న కలలు కన్న..!!

జీవితం తన చేతులతో తనే నాశనం చేసుకొని...


ఏ తల్లిదండ్రులకోసమైతే తన ప్రేమను..!!

త్యాగం చేసిందో వాళ్లే పట్టించుకోకుండా...


పరాయిదానిలా  తనని వదిలేస్తే ప్రాణం పోయేలా.

ఏడుస్తూ తన ఆయువు తీరేదాకా ....

ఆరోపణలతో బతకాల్సిందేనా???..........?


కాబట్టి ఆస్తులు అంతస్తులు కాకుండా

వారు కలకాలం కలిసి ఉండగలరా? అని 


తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఇద్దరు

అభిప్రాయాలు తెలుసుకోవాలి 👍👍👍


ఏది ఏమైనా మీరే బాధ్యతగా భావించాలి 🙏🙏🙏

Sunday, August 15, 2021

మృత_శరీరాలూ_మాట్లాడతాయ్

 #మృత_శరీరాలూ_మాట్లాడతాయ్..!!


విలువల్లేనోడే…

విలువల గురించిమాట్లాడతాడు!


కలలు రానోడే….

రంగుల కలల్నిగురించి వర్ణిస్తాడు !


రాత తెలీనోడే…

ఎదుటోడి తల రాతను  రాస్తానంటాడు.!



ప్రేమ లేనోడే….…

ప్రేమ గురించి ఉపన్యాసాలిస్తాడు.


ఇప్పుడిక….


మృత శరీరాలూ  మాట్లాడతాయి

చేతలతో సంబంధంలేని నీతులు వల్లిస్తాయి.

తస్మాత్ జాగ్రత్త...!!


✍️✍️✍️


Saturday, February 27, 2021

 ప్రేమ అంటే ఒక బాధ్యత
ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే సత్తా
ఉంటేనే ప్రేమించండి ..



Sunday, February 21, 2021

నేరం ఎవరిదయినా శిక్ష మాత్రం నాకే

 నా ప్రశ్నకు జవాబు లేదు 
నా జీవితానికి గమ్యం తెలిదు 
అగ్ని గుండంలాంటి బాధ 
నా గుండెను దహించి వేస్తుంది 
వేధన ఉప్పెనై ముంచ్చెతుంది 
కన్నీరు ఏరులా పారుతుంది
 అయినా విధికి ఇంకా నామీద జాలి లేదు 
నేరం ఎవరిదైనా కావొచ్చు 



శిక్ష అనుభవిస్తుంది మాత్రం నేను, నేను మాత్రమే 
నా లైఫ్ లో నేను చదివింది తక్కువ
గాయపడింది ఎక్కువ 
అందుకేనేమో
చదివి తెలుసుకున్న దానికంటే
గాయపడి తెలుసుకున్నదే ఎక్కువ

Saturday, February 20, 2021

స్ర్తీ జీవితం

 తనంతట తను తనకోసమే 
జీవించే అధికారం స్త్రీకి లేదు.
పురుషుడికి ఉపయోగపడక పోయిందా
స్త్రీ బతికీ ఒకటే,చచ్చీ ఒకటే.
స్త్రీ కి తండ్రి దగ్గర ఉంటే తండ్రి ఊహాలూ,
భర్త దగ్గర ఉంటే భర్తవీ.
స్త్రీ బలం భర్తకి పనులు చెయ్యటానికీ
ఆమె అందం అతని కళ్ళకు 
ఆమె సౌజన్యం అతనికి నమ్మకంగా ఉండటానికీ
ఆమె చదువు కుమారీ శతకం అప్పచెప్పటానికీ
ఆమె సంగీతం అతని  చెవులకి 
స్త్రీ కి ఎన్ని ఆదర్శాలూ,అభిరుచులూ,నేర్పూ ఉన్నా
స్త్రీ అయినంత మాత్రం చేత ఆమెకి 
వంట ఇంటిలోనూ, పడకగదిలోనే పని.


తక్కిన లోకంతో తనకి సంబందం లేదు.
ఇంత చాకిరీ చేస్తే ఫలితమేమిటి?
స్త్రీ కి పురుషుడేమిస్తాడు?
తిండీ,బట్టా,తెలివిగలదైతే నగలూ,
తన ఇష్టం వచ్చినపుడు ఉచితంగా తన్నులో...  ముద్దులో...
స్త్రీ, జీతం లేని సంఘ బానిస.
ఆవుకి ఏం జీతమిస్తారు? చావకుండా గడ్డి పడేస్తారు.
స్త్రీ కి సంఘంలో ప్రత్యేక స్థానం లేదు.
భర్తవల్లే ఆమె స్థానం నిర్ణయించబడుతోంది.
పాకీ ఆమెని రాజు పెళ్ళి చేసుకొంటే ఆమె రాణి అవుతుంది.
కూలివాడు రాజు కూతురిని పెళ్ళి చేసుకొంటే ఆమె కూలి మనిషి అవుతుంది.
ఏంటి ఈ తేడా అర్ధం కావట్లేదు....