Sunday, August 15, 2021

మృత_శరీరాలూ_మాట్లాడతాయ్

 #మృత_శరీరాలూ_మాట్లాడతాయ్..!!


విలువల్లేనోడే…

విలువల గురించిమాట్లాడతాడు!


కలలు రానోడే….

రంగుల కలల్నిగురించి వర్ణిస్తాడు !


రాత తెలీనోడే…

ఎదుటోడి తల రాతను  రాస్తానంటాడు.!



ప్రేమ లేనోడే….…

ప్రేమ గురించి ఉపన్యాసాలిస్తాడు.


ఇప్పుడిక….


మృత శరీరాలూ  మాట్లాడతాయి

చేతలతో సంబంధంలేని నీతులు వల్లిస్తాయి.

తస్మాత్ జాగ్రత్త...!!


✍️✍️✍️


No comments: