#ఒక #ఆడపిల్ల
ప్రాణంగా ప్రేమించిన వాడిని కూడా కాదనుకొని..!!
ప్రాణం బిగపట్టుకొని ప్రాణం పోసిన...
తల్లిదండ్రుల పరువు కోసం మనసు చంపుకొని..!!
పరాయి వాడిని పెళ్లి చేసుకుంటే...
పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళికిముందే నువ్వు ఎవడినో ప్రేమించావని ఆప్రేమ ఈ పెళ్లితో ఆగిపోతుందా...
అంటూ ఆరాలు తీస్తూ అర్థం లేని మాటలతో...!!
అడుగడునా అవమానిస్తూ తన ప్రతి కదలికను.
అనుమానిస్తూ ,తన కలల్ని కోరికలని కాలరాస్తూ.!
నాలుగు గోడల మధ్యన బంధిని చేసి...
చిత్రహింసలు పెట్టి వేదిస్తుంటే.....!!
ఆ ఆడపిల్ల నేను ఏ తప్పు చేయలేదని...
వేడుకుంటున్నా అర్థం చేసుకోలేని వెర్రివాడితో..!!
అర్థం లేని జీవితాన్ని అర్దాంతరంగా....
ముగించేలా...తాను కోరుకున్న కలలు కన్న..!!
జీవితం తన చేతులతో తనే నాశనం చేసుకొని...
ఏ తల్లిదండ్రులకోసమైతే తన ప్రేమను..!!
త్యాగం చేసిందో వాళ్లే పట్టించుకోకుండా...
పరాయిదానిలా తనని వదిలేస్తే ప్రాణం పోయేలా.
ఏడుస్తూ తన ఆయువు తీరేదాకా ....
ఆరోపణలతో బతకాల్సిందేనా???..........?
కాబట్టి ఆస్తులు అంతస్తులు కాకుండా
వారు కలకాలం కలిసి ఉండగలరా? అని
తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఇద్దరు
అభిప్రాయాలు తెలుసుకోవాలి 👍👍👍
ఏది ఏమైనా మీరే బాధ్యతగా భావించాలి 🙏🙏🙏
No comments:
Post a Comment