Saturday, February 20, 2021

స్ర్తీ జీవితం

 తనంతట తను తనకోసమే 
జీవించే అధికారం స్త్రీకి లేదు.
పురుషుడికి ఉపయోగపడక పోయిందా
స్త్రీ బతికీ ఒకటే,చచ్చీ ఒకటే.
స్త్రీ కి తండ్రి దగ్గర ఉంటే తండ్రి ఊహాలూ,
భర్త దగ్గర ఉంటే భర్తవీ.
స్త్రీ బలం భర్తకి పనులు చెయ్యటానికీ
ఆమె అందం అతని కళ్ళకు 
ఆమె సౌజన్యం అతనికి నమ్మకంగా ఉండటానికీ
ఆమె చదువు కుమారీ శతకం అప్పచెప్పటానికీ
ఆమె సంగీతం అతని  చెవులకి 
స్త్రీ కి ఎన్ని ఆదర్శాలూ,అభిరుచులూ,నేర్పూ ఉన్నా
స్త్రీ అయినంత మాత్రం చేత ఆమెకి 
వంట ఇంటిలోనూ, పడకగదిలోనే పని.


తక్కిన లోకంతో తనకి సంబందం లేదు.
ఇంత చాకిరీ చేస్తే ఫలితమేమిటి?
స్త్రీ కి పురుషుడేమిస్తాడు?
తిండీ,బట్టా,తెలివిగలదైతే నగలూ,
తన ఇష్టం వచ్చినపుడు ఉచితంగా తన్నులో...  ముద్దులో...
స్త్రీ, జీతం లేని సంఘ బానిస.
ఆవుకి ఏం జీతమిస్తారు? చావకుండా గడ్డి పడేస్తారు.
స్త్రీ కి సంఘంలో ప్రత్యేక స్థానం లేదు.
భర్తవల్లే ఆమె స్థానం నిర్ణయించబడుతోంది.
పాకీ ఆమెని రాజు పెళ్ళి చేసుకొంటే ఆమె రాణి అవుతుంది.
కూలివాడు రాజు కూతురిని పెళ్ళి చేసుకొంటే ఆమె కూలి మనిషి అవుతుంది.
ఏంటి ఈ తేడా అర్ధం కావట్లేదు....

No comments: