ఇంపైన మేఘాలు
ఇరు కన్నులా కురుస్తుంటే,
అరుదైన మెరుపులు అరుణమై,
ఆ పెదవిరుపులో..
పదనిసలాడుతుంటే,
ఆగని మనోవేగం,
తలపులంచున రెక్కలు కట్టుకొని,
రెప్పలనలా నిదురాపి,
రేపటి నీకై,
రేయినంతా విసిరేస్తుంటే..
వేచి ఉన్న వెన్నెల సైతం,
వేవేల వేణువులై,
వీనుల విందైన,
నీ పేరు తలవదా?
తలగడని తడిపిన,
నయనాలు..
నవ్యమై
కావ్యమై
వినూత్నమై
వేచి చూడవా?
ఆ నీ పిలుపు కోసం!!! ♥️
No comments:
Post a Comment