Monday, July 15, 2013

ఏమీ ఆశించని ప్రేమతో నీ మదిలోనే నిలుస్తాడు నీ నేస్తం .......

అంతులేని  నీ అందం, అందని ఆకాశం 
లోతు లోతు లో వున్న నా ఆశ తీరానికి చేరని ప్రేమ నౌక 
అగాధం లో చిక్కుకున్న నా మనస్సు 
ప్రేమ అంచులకు చేరేది ఎన్నటికో!!!

ప్రేమ సాగర తీరానికి చేరాలనుకునే నా మనసుకు దూరం తెలియదు! 
దారి తెలియక విలవిలలాడుతున్న నా మనస్సుని 
ఓదార్చే ఓ వనితా !!
నీ నవనీత మనస్సుని నాకు అర్పించేది ఎప్పుడో !!

ఈ ఉదయించే ప్రేమ కిరణం నీ చిగురించే మనస్సుని తాకేది ఎప్పుడో! 
స్వార్థమే తెలియని నీ మనస్సులో నా నిస్వార్థపు మనస్సుకి చోటేప్పుడో!



పరవళ్ళు తొక్కే నీ నవ్వులు 
పయనించే నా మార్గానికి మెట్లు 
నీ కలయికతో నా మనస్సులో రేపిన కలకలం నీ ప్రేమతో చల్లార్చెదేప్పుడో !!!

ఏమీ ఆశించని ప్రేమతో 
వేచిచూస్తున్న నీ నేస్తం ..... నీ చిరునవ్వు కోసం 
నీ మదిలోనే నిలుస్తాడు

నీ నేస్తం .......  


No comments: