Wednesday, December 26, 2012

గుర్తులను చెరుపుకుందామనుకున్నాను




గుర్తులను చెరుపుకుందామనుకున్నాను 
చెరగని ముద్రల్లా నన్ను వెంటాడుతున్నాయి
కష్టాల సముద్రం కదా!
కెరటాల ఘోష ఎక్కువే!

మనసు 
మార్చుకున్దామనుకున్న 
ఊసరవెల్లి కదా
మాట వినడం లేదు 



మబ్బులు -మనసు
మసకబారిన జీవితం
మబ్బుల్లో చంద్రుడు 
ఆకాశంలో నేను 

ఆలోచనలు తేనిటీగలు
కోర్కెలు తేనె పట్టు
అంతర్లీనంగా నేను 
కదిలిస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి 
స్మ్రుతుల్లా ...

No comments: