నిన్ను మర్చిపోవాలన్న ప్రతి క్షణం....
నన్ను వెంటాడే నీ జ్ఞాపకాల గతం....
నిన్ను ప్రేమించడం నేర్చుకున్న హృదయం
ఎడబాటుకు చేరువై,చేరమన్నది మరణ వలయం
నీ కౌగిలిలో ఒదిగిపోవాలన్న కోరిక లేదు....
నీ మనసులో చోటు సంపాదించాలన్న ఆశ లేదు...
నీ చేయి అందుకోవాలన్న ఆత్రత లేదు.....
నీతో గడిపిన రోజులు మళ్లి రావాలని....
ప్రేమగా నీ యదపై కలకాలం నిదురించాలని...
నీ స్నేహం నన్ను దూరం చేయక ముందే....
నా శ్వాస గాలిలో చేరిపోవాలని....
No comments:
Post a Comment