Saturday, September 1, 2012

పోతున్న పోతున్న శాశ్వతంగా దూరమై పోతున్న.....!!!

 పోతున్న పోతున్న దూరమై పోతున్న....,
కలల కోటను కుప్ప కూల్చి ఆశలను మట్టిలో
కలిపి,గుండె కోతను తుడిచి పోతున్న.......!!
కిల కిల నవ్వుల పాటను గాలికి అప్పగించి వెళుతున్న....,
గల గల మాటలను ముసి చీకటికి చెప్పి విడిపోతున్న.....,
జ్ఞాపకాలను కానని గదిల
ో వేసి తరలి పోతున్న......,
మధుర క్షణాలను కన్నీటికి వదలి కదులుతున్న......,



అంతరాత్మ తలుపుకి గొళ్ళెం పెట్టి సాగుతున్న.......,
తిరిగి చూస్తే నీడ కూడా పామై కాటు వేసిందే ప్రేమ బ్రాంతి.....!!
ఇదిగో ఇదిగో దయలేని త్యాగమా పోతున్న పోతున్న దూరమై పోతున్న
ప్రేమ ప్రదర్శనము నా మనసులోని మనిషికి చెప్పలేక అల్లాడిపోయాను,
ధైర్యంగా చెప్పాక మానసికంగా కృంగిపోయాను .......!!
తప్పులన్నీ నావే అంటూ తన పొరపాట్లు లేవన్న ఓ అధిపతి.....,
నా స్నేహాన్ని గుర్తించుకుంటానని రాళ్ళు......,
దూసిన బతిమాలుకోను అంటూ పోతున్న పోతున్న......,
కమ్మని హాయిని కాల్చి పోతున్న పోతున్న శాశ్వతంగా దూరమై పోతున్న.....!!!

No comments: