Thursday, September 20, 2012

జన్మంతా ఇక నిరీక్షణలే.....

'నేస్తం', అంటూ నా కోసం
నీ స్నేహం జత చేసావు.
నాకే తెలియని, ఇక ఫై మరువని
నడకను నాకే నేర్పావు. 
తీరం అంతు ఎంతైనా,


అలలకు అలసట కలిగేనా ?

మన దూరం కరిగిన నా

కలలకు నీ ఊహే అందెనులే.
చెదిరిన కల మన గతమైనా ,

చెరగని రూపం నీదేలే .


పెదవులపైనా చిరునవ్వైనా

కలిగిన అది నీవేలే...






గెలుపు ఓటమి తేడా తెలియని

చెలిమే మనలో చిగురించేనా.

పసిపిల్లలమై మనసులు తడిసిన,

ఇరువురి కనులే చమరించేనా.
మౌనం కూడా మన భాషేనా ?

హృదయం తొంగి చూస్తుంది.


తెలుపని మాటలు ఎన్నో ఉన్నా,

మన భావం ఒక్కటయ్యింది.
చలనములేని క్షణములు ఎన్నో

సరసకు రమ్మని పిలిచేలే...

రోజు నీకై వెతికే కనులకు ,


జన్మంతా ఇక నిరీక్షణలే.....

No comments: