Tuesday, September 25, 2012

తనే చెదిరిపోనీ కలగా మిగిలి పోయింది......

అందమైన చీకటిలో వెన్నెల లాగ నిశీధిలో ఉషోదయం లాగ 

నిర్మానుష్యంగా గా ఉన్న నా మనసులోకి తనోచ్చింది

మరిపిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ ఏదో మాయ చేసింది.

ఎం జరుగుతుందో తెలియదు కాని తను కన్పించగానే ఒళ్ళంతా విద్యుత్ 

ప్రవహిస్తుంది



తనని చూడగానే ఏదో ప్రకంపన, 

మనసు తన వైపే లాగుతుంది, అదేదో గురుత్వాకర్షణ శక్తి లాగ...!

చీకట్లోకి చందమామ వచినట్లు తనోచ్చింది నా జీవితంలోకి...

అదేంటో చందమామ రోజు వస్తూనే ఉంది కాని తనే చెదిరిపోనీ కలగా మిగిలి

 పోయింది......

No comments: