Thursday, August 30, 2012

"ఆడపిల్లగా" పుట్టడం నేను చేసిన నేరమా...??



పాపాత్ములు పరిపాలిస్తున్న ఈ కలియుగంలో
"ఆడపిల్లగా" పుట్టడం నేను చేసిన నేరమా...??
వరకట్నం ఇవ్వలేని కన్నవాళ్ళ కన్నీటి కథలకు
కారణం కావడం నాకు శాపమా....??
ఎదిగిన నేను,నవ మాసాలు మోసిన అమ్మకు భారమయాను
నడక నేర్పించిన నాన్నకు గుండె కోతగా మారాను










ప్రేమగా ఆటలాడిన అన్నయ్యకు డబ్బు తుంచే తక్కిడినయాను..!!
ఆడపిల్లంటే ఆడ-పిల్లే కాని ఏనాటికి ఇడ-పిల్ల కాలేదన్న సమాజం
మాటలకు ప్రతిక్షణం నేను భాదపడిన.....
దేశంకోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులకు
జన్మనిచ్చిన "ఆడజాతిలో" నేను ఓ ఆడపిల్లగా....
పుట్టినందుకు గర్వంగుంది.

No comments: