Wednesday, August 1, 2012

ఊహలలో ఊసులాడుతున్నది



ఊహలలో ఊసులాడుతున్నది ఎవరని
నే చూడ లేదు ఆ ప్రియుడిని......!!
ఏడాది నిమిషం అయే,యుగం క్షణం అయే
మధురమైన ఊహల ప్రియుడి ఊసులతో.....
వెన్న ముద్దలు కాజేసి,కన్నె మనసులను
ఉయ్యాల ఉపించిన బృందావన కృష్ణుడేమో....??
విషమును సేవించి గంగని తలపై మోసి,...
అర్ధనారీశ్వరుడైన నిలకంఠుడేమో......??
నిత్యం ధర్మం భోదించి ఏక ప్రతివ్రతుడైన
రఘుకుల రాముడేమో......?? హిమ పర్వతం
నీరు చేసి నదిపై నను నడిపిస్తాడు.నింగికి నిచ్చెన
వేసి నెలవంకపై నను నిలబెడతాడు.నందన వనంలో
పూల రాశులను నా గుమ్మంలో గుమ్మరిస్తాడు.......
సీతాకోక చిలుకల గుంపులలో నను ఊరేగిస్తాడు......
రెప్పల చాటునున్న కలల ప్రియుడ మందార,.....
మాలతో నను మనువాడ రారా మన్మథుడ......!!

No comments: