Tuesday, July 24, 2012

ఏమిటి నీ లక్ష్యం



నా అంతర్యంలోకి తొంగి చూడాలని ఎందుకంత ఆశ

ఇక్కడ విశాల ప్రపంచం కాలక్షేపంగా

పాడుకొనే సరాగాల సరిగమలు లేవు

ఎ సినీకవో జాలువార్చిన విషాద గీతాలు తప్ప

అంతర్ముఖ కల్లోలమైన అంతఃపురాలు లేవు

ఆందోళనతో అల్లిన పొదరిల్లు తప్ప

నీవు నా మీద ప్రయోగించిన ఈ ప్రేమాస్త్రం

నీకు కొత్తది కాకపోవచ్చు(కనీసం వినివుంటావేమొ)

కాని నా systematic ప్రపంచానికి ఇది కొత్తదే



నేను నేర్చిన అక్షరాలలో ఎక్కడ అందమైన పుష్పాలు లేవు

ఆర్ద్రమిళితమై రాలిపోయిన చిగురుటాకులు తప్ప

నీ చూపుల శూలాలను నా గుండెను లక్ష్యంగా 
చేసుకొని వదలటంలోని అంతర్యం నాకు అర్థం కావటం లేదు  

No comments: