Tuesday, July 24, 2012

విలువైన క్షణం


మేలుకో ప్రాణమా చే జారక ముందే విలువైన క్షణం

పలుకవే మౌనమే కను దాటకముందే నిజమైన నేస్తం

ఎపుడో గెలిచావని ఇంకేపుడో గెలిచేవని

 ఎంతకాలం ఎదురు చూసేవు కలగనీ

ఆశలే ఆయువై నిరాశల దారిలో ఎంతవరకీ  గమనము 



మాటల కోటలో ఎందుకొరకీ అవిరామ  సాధనము


చీకటి బాటలో వెలుతురుకై వేచియుం తగునా.?


రాతిరి పోనిదే రవికి రాకడ లేదని గగనం

శశి ని మరచి నిలుచునా ..?

పుడమినేంత చదివినా కడలి ఇంత దాహం తీర్చునా 

ఎంత దూరం వెదకినా ఇంకెంతో దూరం మిగిలేనా ........! 

No comments: