ఏమీ పట్టనట్టు
నన్ను వదిలి వెళ్ళిపోయావుగా
మళ్ళీ నీ జ్ఞాపకాల ఊబిలోకి
నన్నెందుకు లాగుతున్నావ్
ఏ సంబంధం లేదని
మన బంధాన్ని తెంచేశావుగా
నన్ను వదిలి వెళ్ళిపోయావుగా
మళ్ళీ నీ జ్ఞాపకాల ఊబిలోకి
నన్నెందుకు లాగుతున్నావ్
ఏ సంబంధం లేదని
మన బంధాన్ని తెంచేశావుగా
మరి నీ ఆలోచనల సంకెళ్ళతో
నన్నెందుకు బంధిస్తున్నావ్?
మనమిద్దరం కలిసుండడం కుదరదన్నావుగా
మళ్ళీ నా కలల ప్రపంచంలో రోజూ ఎందుకు కలుస్తున్నావ్?
నీ కళ్ళలోని నా రూపానికి రెప్పల ముసుగు వేశావుగా
మరి నీ కన్నీళ్ళని నన్ను వెతకమని
ఎందుకు పంపావ్ చెప్పు ప్రియా సమాదానం చెప్పు
No comments:
Post a Comment