Tuesday, September 20, 2011

కొన్ని అనుభవాలకు మరో తోడూ అవసరమేమో ...........................



కొన్ని అనుభవాలకు మరో తోడూ అవసరమేమో కానీ


చాలా అనుభూతులను ఆనందించడానికి ఒంటరితనానికి మించినది ఉండదు.


భావాలను పంచుకోటానికి మరో తోడూ అవసరమే కావచ్చు...


మనో గీతాలను ఆలపించడానికి ఒంటరితనం అవసరం..


ఒక్కో మారు మాటలకన్నా మౌనమే ఎక్కువ భావాల్ని చెబుతుంది.....


ఇలా ఆలోచించడం నా జాడ్యమో సహజసిద్దమో ఈ ప్రకృతి సహజమో తెలీదు....


కానీ పలకరింత దైవికమైనదని నేను నమ్ముతాను....