Friday, January 15, 2010

నా జీవితం

నా జీవితం

ఘడియలు, క్షణాలు,
గంటలు, రోజులు
గడుస్తూ వుంటే
కొత్త కొత్త లక్ష్యాలు వస్తూవుంటే
యుక్తినంతా కూడగట్టుకొని
శక్తినంతా చేతపట్టుకొని
అడుగులో అడుగు వేస్తూ
గమ్యంవైపు నడుస్తూవుంటే
నా లోని సైనికుడు
మును ముందుకు సాగిపోతున్నాడు

ప్రతి పనికి, ప్రతి అడుగుకి
అలా ఎందుకు, యిలా ఎందుకు అంటూ
పది మందీ
ప్రశ్నలతో గుచ్చి పోతున్నారు

సమాధానం చెప్పకపోతే
చవటనను కుంటున్నారు
సమాధానం చెపుతూ పోతే
నా సమయం వృధా చేస్తున్నారు
సమయం వృధా చేసానంటున్నారు
సహాయం అడిగితే మాత్రం
సమయం లేదంటున్నారు

గమ్యం వైపు సాగిపోతుంటే
సహాయం చేసే చేతులుకన్నా
విమర్సించే మాటలు
వూరంతా వినపడుతున్నాయి

క్రమశిక్షణ పేరుతో
మనసుతో యుద్ధం
అనారోగ్యంతో
కృశిస్తున్న దేహం
ప్రశ్నల వేధింపులతో
నిత్యం సాగుతున్న రణం
ప్రతి రోజు సమస్యలతో
జీవిత పోరాటం

శక్తిని, యుక్తిని,
కాలాన్ని, ధనాన్ని
గుఱ్ఱాలుగా కట్టి
లక్ష్యం వైపు
వేగంగా సాగిపోతుంటే
జీవిత రధ చక్రం
అనారోగ్యం అనే ఊబిలో
రోజు రోజుకి
కూరుకు పోతుంది

ప్రాపంచిక లక్ష్యాలు,
క్షణిక మైన జీవితాలు
కలకాలం వుండవని
తత్వశాస్త్రాలు ఘోషిస్తుంటే
కసి కొద్దీ కాలంతో
చేస్తున్నాను సమరం

సమరయోధుడిలా సాగిపోతానో
చతికల పడ్డ ఎద్దులా వుండిపోతానో
బురదగుంటలో పందిలా మిగిలిపోతానో
అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతానో
అన్ని త్యజించిన మునిలా మారిపోతానో
కాలమే చివరకు తెలియజేస్తుంది
కాలగర్భంలో నన్ను కలిపేసుకుంటుంది

1 comment:

polimetla said...

Copied from http://polimetla.com/telugu-poetry/naa_jeevitam/

Please delete this poem.